Gunturkaram : ఒకటి కాదు.. రెండు!

ABN , First Publish Date - 2023-08-10T04:38:23+05:30 IST

మహేశ్‌ బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘గుంటూరు కారం’. మహేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా స్టైలిష్‌ మాస్‌ అవతార్‌లో కనిపిస్తున్న సూపర్‌ మాస్‌ పోస్టర్స్‌ను బుధవారం చిత్ర బృందం విడుదల...

Gunturkaram : ఒకటి కాదు.. రెండు!

మహేశ్‌ బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘గుంటూరు కారం’. మహేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా స్టైలిష్‌ మాస్‌ అవతార్‌లో కనిపిస్తున్న సూపర్‌ మాస్‌ పోస్టర్స్‌ను బుధవారం చిత్ర బృందం విడుదల చేసింది. లుంగీ కట్టుకుని, కళ్లద్దాలు పెట్టుకొని, బీడీ కాలుస్తున్న లుక్‌ ఒకటైతే, జీన్స్‌, బ్లాక్‌ టీ షర్ట్‌పై రెడ్‌ కలర్‌ షర్ట్‌, ఎర్రని తలపాగాతో ప్రత్యర్ధులతో తలపడుతున్న లుక్‌ మరొకటి. ఈ రెండు పోస్టర్స్‌ చూసి మహేశ్‌ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నెల ద్వితీయార్థంలో ‘గుంటూరు కారం’ షెడ్యూల్‌ మొదలవుతుంది. వచ్చే ఏడాది జనవరి 12న భారీ స్థాయిలో విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక, హాసిని క్రియేషన్స్‌ బేనరుపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-08-10T04:38:23+05:30 IST