మా నిర్మాత ఎవరో ఎవరికీ తెలియదు

ABN , First Publish Date - 2023-09-13T00:23:24+05:30 IST

అభయ్‌ నవీన్‌ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘రామన్న యూత్‌’. అమూల్య రెడ్డి కథానాయిక. ఈ నెల 15న విడుదలవుతోంది. ఇటీవలే చిత్రబృందం ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించింది...

మా నిర్మాత ఎవరో ఎవరికీ తెలియదు

అభయ్‌ నవీన్‌ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘రామన్న యూత్‌’. అమూల్య రెడ్డి కథానాయిక. ఈ నెల 15న విడుదలవుతోంది. ఇటీవలే చిత్రబృందం ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించింది. విష్వక్‌సేన్‌, ప్రియదర్శి, తిరువీర్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్వక్‌సేన్‌ మాట్లాడుతూ ‘తరుణ్‌ భాస్కర్‌ ఏడాదిన్నర క్రితమే ఈ కథ చెప్పాడు. గ్రామీణ రాజకీయ నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ పొలిటికల్‌ డ్రామా యువతకు బాగా నచ్చుతుంది. ‘రామన్న యూత్‌’ ఘన విజయం సాధించాలి’ అని కోరుకున్నారు. అభయ్‌ నవీన్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమా నిర్మాతలు స్ర్కిప్ట్‌ చదవలేదు. ఒన్‌ లైన్‌ ఆర్డర్‌ కూడా చదవలేదు. స్ర్కీన్‌ మీద సినిమా చూశారు. ఆ ప్రొడ్యూసర్‌ ఎవరో ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. మంచి సినిమా తీయాలనేదే వారి లక్ష్యం. మా సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్‌ చేయండి’ అని ప్రేక్షకులను కోరారు. నేను ‘రామన్న యూత్‌ సినిమా చూశాను. ఇందులో మంచి కథ ఎమోషన్‌ ఉంది. ప్రేక్షకులు తప్పకుండా చూడాలి’ అన్నారు. తిరువీర్‌ మాట్లాడుతూ ‘అభయ్‌ కెరీర్‌లో ఈ సినిమా మొదటి మెట్టు మాత్రమే, ప్రేక్షకులు ఆదరిస్తే ‘రామన్నయూత్‌’ లాంటి మంచి సినిమాలు మరిన్ని వస్తాయి’ అని చెప్పారు.

Updated Date - 2023-09-13T00:23:24+05:30 IST