ఒత్తిడి ఉన్నా.. విజయం మీద నమ్మకం ఉంది

ABN , First Publish Date - 2023-12-14T00:42:23+05:30 IST

‘బేబి’ చిత్రంతో లవర్‌బాయ్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న విరాజ్‌ అశ్విన్‌ తాజా చిత్రం ‘జోరుగా హుషారుగా’ ఈ నెల 15న విడుదల కానుంది. అను ప్రసాద్‌ దర్శకత్వంలో నిరీశ్‌...

ఒత్తిడి ఉన్నా.. విజయం మీద నమ్మకం ఉంది

‘బేబి’ చిత్రంతో లవర్‌బాయ్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న విరాజ్‌ అశ్విన్‌ తాజా చిత్రం ‘జోరుగా హుషారుగా’ ఈ నెల 15న విడుదల కానుంది. అను ప్రసాద్‌ దర్శకత్వంలో నిరీశ్‌ తిరువీధుల నిర్మించారు. బుధవారం విరాజ్‌ మీడియాతో మాట్లాడుతూ ‘ఒక హిట్‌ సినిమా తర్వాత వస్తున్న సినిమాకు ఎంతో హెల్ప్‌ అవుతుందనడానికి ‘జోరుగా హుషారుగా’ మంచి ఉదాహరణ. ‘బేబి’ తర్వాత వస్తున్న ఈ సినిమాపై అందరిలోనూ పాజిటివ్‌ వైబ్స్‌ ఉన్నాయి. వ్యక్తిగతంగా నాకు కాస్త ప్రెజర్‌గా ఉన్నా ఈ సినిమా కూడా తప్పకుండా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు. ఈ సినిమాలో చేనేత కుటుంబానికి చెందిన యువకుడిగా నటించానని చెబుతూ ‘నా పాత్ర అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తుంది. పర్సనల్‌గా నాకు ఎంతో కనెక్ట్‌ అయింది. ముఖ్యంగా ఇందులో తండ్రీకొడుకుల అనుబంధం అందరినీ కట్టి పడేస్తుంది. ఒక మధ్యతరగతి తండ్రి తన కొడుకు కోసం ఎలాంటి త్యాగాలు చేశాడు, కుటుంబం కోసం ఆ కొడుకు ఏం చేశాడు.. అనేది ఎమోషనల్‌గా ఉంటుంది’ అని చెప్పారు విరాజ్‌. ‘హాయ్‌ నాన్న’, ‘యానిమల్‌’, ‘జోరుగా హుషారుగా’, రాబోయే ‘సైంధవ్‌’.. ఇలా ఫాదర్‌ ఎమోషన్స్‌ కలిగిన సినిమాలు వరుసగా ఒకే నెలలో విడుదల కావడం కాకతాళీయమే అయినా సర్ర్పైజింగ్‌గా ఉందని విరాజ్‌ చెప్పారు. ‘హాయ్‌ నాన్న’ చిత్రం డైరెక్షన్‌ టీమ్‌ అంతా తన ఫ్రెండ్స్‌ కావడంతో ఆ చిత్రంలో నటించాననీ, అందులో నాని పాత్ర పేరు విరాజ్‌ కావడం ఆనందంగా ఉందని విరాజ్‌ చెప్పారు. ప్రస్తుతానికి హీరోగానే కంటిన్యూ అవుతాననీ, నచ్చిన పాత్రలు, పవర్‌ఫుల్‌ రోల్స్‌ వస్తే ఇతర హీరోల చిత్రాల్లో కూడా నటిస్తానని విరాజ్‌ తెలిపారు.

Updated Date - 2023-12-14T00:42:27+05:30 IST