‘అజాగ్రత్త’ వద్దు...
ABN , First Publish Date - 2023-05-14T02:42:51+05:30 IST
బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే కథానాయకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘అజాగ్రత్త’. రాధిక కుమారస్వామి కథానాయిక. ఎం.శశిధర్ దర్శకుడు...

బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే కథానాయకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘అజాగ్రత్త’. రాధిక కుమారస్వామి కథానాయిక. ఎం.శశిధర్ దర్శకుడు. రవి రాజ్ నిర్మాత. శనివారం ఉదయం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ఏ.ఎం.రత్నం క్లాప్ కొట్టారు. ఠాగూర్ మఽధు స్విచ్చాన్ చేశారు. ‘‘ఏడు భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. అజాగ్రత్తగా ఉంటే వచ్చే పరిణామల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అందుకే ఈ టైటిల్ పెట్టామ’’ని దర్శక నిర్మాతలు తెలిపారు. రావు రమేశ్, సునీల్, ఆదిత్య మీనన్ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: శ్రీహరి.