కథను నమ్మి చేసిన సినిమా నీతోనే నేను

ABN , First Publish Date - 2023-10-12T03:24:49+05:30 IST

సినిమాబండి ఫేమ్‌ వికాస్‌ వశిష్ఠ హీరోగా, మోక్ష, కుషిత కళ్లపు హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘నీతోనే నేను’. అంజిరామ్‌ దర్శకత్వంలో ఎం. సుధాకర్‌రెడ్డి నిర్మించారు. ఈ నెల 13న విడుదలవుతోంది...

కథను నమ్మి చేసిన సినిమా నీతోనే నేను

సినిమాబండి ఫేమ్‌ వికాస్‌ వశిష్ఠ హీరోగా, మోక్ష, కుషిత కళ్లపు హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘నీతోనే నేను’. అంజిరామ్‌ దర్శకత్వంలో ఎం. సుధాకర్‌రెడ్డి నిర్మించారు. ఈ నెల 13న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం మెదక్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతూ ‘33 రోజుల్లో ‘నీతోనే నేను’ షూటింగ్‌ పూర్తి చేశాం. ‘కమర్షియల్‌ సినిమా చేయకుండా టీచర్స్‌ మీద సినిమా చేస్తున్నారేంటి?’ అని చాలామంది నన్ను అడిగారు. నా కథ మీద నమ్మకంతో ముందడుగు వేశాను. ప్రేక్షకులు మంచి సినిమా చూసిన అనుభూతి పొందుతారు’ అన్నారు. అంజిరామ్‌ మాట్లాడుతూ ‘సుధాకర్‌రెడ్డి అందించిన మద్దతు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన డెడికేషన్‌, కమిట్‌మెంట్‌తో ఈ సినిమా పూర్తి చేశారు’ అని చెప్పారు. ఈ చిత్రంలో పాటలన్నీంటికీ చక్కని స్పందన వచ్చిందని సంగీత దర్శకుడు కార్తీక్‌ బి. కడగండ్ల తెలిపారు.

Updated Date - 2023-10-12T03:24:49+05:30 IST