ప్రజాకవికి పాటల నీరాజనం
ABN , First Publish Date - 2023-09-05T02:08:32+05:30 IST
ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజీ నారాయణరావు జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’. ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో విజయలక్ష్మి జైనీ నిర్మిస్తున్నారు. కాళోజీ పాత్రను మూలవిరాట్ పోషిస్తున్నారు...

ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజీ నారాయణరావు జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’. ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో విజయలక్ష్మి జైనీ నిర్మిస్తున్నారు. కాళోజీ పాత్రను మూలవిరాట్ పోషిస్తున్నారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సోమవారం ఈ చిత్రంలోని పాటలను మీడియాకు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ ‘కాళోజీ ఔన్నత్యాన్ని, వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే ఘట్టాలతో ఈ సినిమాను తెరకెక్కించాం. ఆయన జీవించిన, తిరిగిన ప్రదేశాల్లో సినిమా తీశాం. మూలవిరాట్‌ను చూస్తుంటే నిజంగా కాళోజీ గారే వచ్చినట్లు ఉంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అన్నారు. విజయలక్ష్మి జైనీ మాట్లాడుతూ ‘కాళోజీ బయోపిక్ తీసే అవకాశం రావడం నా అదృష్టం. కాళోజీ నివసించిన ఇంట్లో షూటింగ్ చేశాం. ఆయన చేతికర్ర, కళ్లజోడును ఉపయోగించాం. ఈ చిత్రంలోని పాటలు సినిమాకు ఒక ఔన్నత్యాన్ని ఆపాదిస్తాయి అని సంగీత దర్శకడు శ్రీధర్ తెలిపారు. కాళోజీ పాత్ర చేసిన తర్వాతే నా జీవితానికి సార్థకత లభించిందనే భావన కలిగిందని మూల విరాట్ తెలిపారు.