నా కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు
ABN , First Publish Date - 2023-06-30T23:58:51+05:30 IST
‘స్పై’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా చక్కని స్పందన వస్తోంది. నా కెరీర్‌లోనే అత్యధిక మొదటి రోజు వసూళ్లు వచ్చాయి.
‘‘స్పై’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా చక్కని స్పందన వస్తోంది. నా కెరీర్‌లోనే అత్యధిక మొదటి రోజు వసూళ్లు వచ్చాయి. సినిమాను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు శిరసు వ ంచి నమస్కరిస్తున్నాను’ అని నిఖిల్ సిద్ధార్థ్ చెప్పారు. గ్యారీ బీ హెచ్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన చిత్రమిది. శుక్రవారం జరిగిన సక్సెస్‌మీట్‌లో నిఖిల్ మాట్లాడుతూ ‘శ్రీ చరణ్ నేపథ్య సంగీతం బావుందని ప్రేక్షకులు చెబుతున్నారు. వినోదం, హాస్యం, దేశభక్తి అన్నీ ఉన్నాయి. అందుకే ‘స్పై’ను కుటుంబంతో ఆనందిస్తున్నారు’ అని చెప్పారు. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కడం ఆనందాన్నిచ్చిందని గ్యారీ తెలిపారు. తెలుగులో చేసిన మొదటి చిత్రమే ఇంత పెద్ద విజయాన్ని అందుకొన్నందుకు ఆనందంగా ఉందని ఐశ్వర్య మీనన్ చెప్పారు. విజయాన్ని అందుకొన్నందుకు ఆనందంగా ఉందని ఐశ్వర్య మీనన్ చెప్పారు.