నిహారిక, చైతన్య విడాకులు
ABN , First Publish Date - 2023-07-05T02:53:34+05:30 IST
ప్రముఖ సినీ నటుడు నాగబాబు కూతురు నిహారిక, జొన్నలగడ్డ చైతన్య దంపతులకు కూకట్‌పల్లిలోని ఫ్యామిలీ కోర్టు ఇటీవల విడాకులు మంజూరు చేసింది...
ప్రముఖ సినీ నటుడు నాగబాబు కూతురు నిహారిక, జొన్నలగడ్డ చైతన్య దంపతులకు కూకట్‌పల్లిలోని ఫ్యామిలీ కోర్టు ఇటీవల విడాకులు మంజూరు చేసింది. పెద్దల సమక్షంలో వీరిద్దరి పెళ్లి 2020 డిసెంబరులో రాజస్థాన్‌లో వైభవంగా జరిగింది. పెళ్లైన కొంత కాలానికే మనస్ఫర్థలు రావటంతో పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరువురు కూకట్‌పల్లిలోని ప్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసును విచారించిన ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేస్తూ జూన్ 5న ఉత్తర్వులు జారీ చేసింది. విడాకులకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీలను ఇటీవలే కోర్టు నుంచి పొందారు.
కూకట్‌పల్లి, ఆంధ్రజ్యోతి