కొత్తగా చెప్పిన ప్రేమకథ ఖుషి

ABN , First Publish Date - 2023-08-30T04:53:42+05:30 IST

‘పెళ్లికి ముందు, ఆ తర్వాత వచ్చే సమస్యలతో చాలా సినిమాలు వచ్చాయి. అందుకే టైటిల్‌కు తగ్గట్లుగా వినోదాత్మకంగా కథ చెప్పాలనుకున్నా. ‘డియర్‌ కామ్రెడ్‌’ సినిమా తర్వాత విజయ్‌కు ఈ కథ చెప్పా...

కొత్తగా చెప్పిన ప్రేమకథ ఖుషి

‘పెళ్లికి ముందు, ఆ తర్వాత వచ్చే సమస్యలతో చాలా సినిమాలు వచ్చాయి. అందుకే టైటిల్‌కు తగ్గట్లుగా వినోదాత్మకంగా కథ చెప్పాలనుకున్నా. ‘డియర్‌ కామ్రెడ్‌’ సినిమా తర్వాత విజయ్‌కు ఈ కథ చెప్పా. ఆ తర్వాత ఏడాదిన్నరకు ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లింది’ అన్నారు దర్శకుడు శివ నిర్వాణ. విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా ఆయన దర్శకత్వంలో మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మించిన ‘ఖుషి’ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా శివ నిర్వాణ మీడియాతో ముచ్చటించారు.

  • ‘‘నిన్ను కోరి’, ‘మజిలీ’ చిత్రాల్లో నేను ఫెయిల్యూర్‌ లవ్‌ స్టోరీస్‌ చూపించాను. వ్యక్తిగతంగా సరదాగా ఉండడం నాకు ఇష్టం. అందుకే వినోదాత్మకంగా, సరదాగా ఉండే ప్రేమకథను తీయాలని ‘ఖుషి’ రూపొందించాను. ఈ సినిమాకు మొదట ‘సరదా’ అనే టైటిల్‌ను అనుకున్నాను. కానీ విజయ్‌, సమంత కున్న పాన్‌ ఇండియా ఇమేజ్‌ వల్ల, ఐదు భాషల్లో ఒకే టైటిల్‌ ఉంటే బాగుంటుందని అనిపించి ‘ఖుషి’ టైటిల్‌ ఫిక్స్‌ చేశాం’.

  • ‘ప్రేమకథను ఎంతో కొత్తగా చెప్పాలి అనే ఆలోచన లోంచి పుట్టిందే కశ్మీర్‌ బ్యాక్‌డ్రాప్‌. ప్లజెంట్‌ ఉన్న ప్లేస్‌ నుంచి కథను మొదలు పెట్టాలి, హీరో హీరోయిన్ల మధ్య పరిచయం ఫన్‌తో సాగాలి అనుకున్నాను. అలాగే చేశాను. సమంత డెడికేటెడ్‌ హీరోయిన్‌. అటువంటి వ్యక్తికి ఆరోగ్య సమస్య వస్తే మేమంతా సపోర్ట్‌ చేయకుండా ఎలా ఉంటాం? ఆమెకు పూర్తిగా నయం అయిన తర్వాతే షూటింగ్‌ చేశాం’.

  • ‘విజయ్‌లో మంచి టైమింగ్‌ ఉంది. ‘పెళ్లి చూపులు’, ‘గీత గోవిందం’ చిత్రాల్లో ఒకలాంటి కామెడీ టైమింగ్‌ చూశారు. కానీ మా సినిమాలో స్టైలిష్‌ కామెడీ చేశాడు. అమ్మాయిలకు, ఫ్యామిలీ ఆడియన్స్‌కు విజయ్‌ పాత్ర బాగా నచ్చుతుంది. అందరూ ఆయన క్యారెక్టర్‌ను ఓన్‌ చేసుకుంటారు. ఇందులో హిందూ ముస్లీంల మధ్య గొడవలు చూపించడం లేదు. కానీ ఒక సెన్సిటివ్‌ ఇష్యూను కథలో చూపించాం’.

  • ‘ఐదు నెలలు ఈ సినిమా షూటింగ్‌ ఆగిపోయినా ఒక్క రోజు కూడా నిర్మాతలు నన్ను అడగలేదు. పెట్‌కి వచ్చి ఇంకొంచెం పెద్ద సెట్‌ వేసి ఉంటే బాగుండేది అనేవారంటే వాళ్లు దర్శకుడికి ఎంత సపోర్ట్‌ చేస్తారో అర్థం చేసుకోవచ్చు. ‘ఖుషి’తో మైత్రి సంస్థతో మంచి అనుబంధం ఏర్పడింది’.

Updated Date - 2023-08-30T04:53:42+05:30 IST