కొత్త తరహా కథల్ని ప్రోత్సహించాలి

ABN , First Publish Date - 2023-10-25T01:34:37+05:30 IST

‘‘రక్షిత్‌ అట్లూరి రెగ్యులర్‌ సినిమాలు చేయడు. కొత్త తరహా కథల్ని ఎంచుకొంటాడు. అలాంటి ప్రయత్నాల్ని ప్రోత్సహించాలి’’ అన్నారు నాగశౌర్య. రక్షిత్‌ నటించిన ‘నరకాసుర’ ట్రైలర్‌...

కొత్త తరహా కథల్ని ప్రోత్సహించాలి

‘‘రక్షిత్‌ అట్లూరి రెగ్యులర్‌ సినిమాలు చేయడు. కొత్త తరహా కథల్ని ఎంచుకొంటాడు. అలాంటి ప్రయత్నాల్ని ప్రోత్సహించాలి’’ అన్నారు నాగశౌర్య. రక్షిత్‌ నటించిన ‘నరకాసుర’ ట్రైలర్‌ మంగళవారం హైదరాబాద్‌లో నాగశౌర్య చేతుల మీదుగా విడుదలైంది. సెబాస్టియన్‌ దర్శకత్వం వహించారు. అజ్జా శ్రీనివాస్‌ నిర్మాత. ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ ‘‘రక్షిత్‌ నా బాల్య స్నేహితుడు. సినిమాల్లోకి వస్తానంటే ‘బాగా డబ్బుంది కదా.. అందుకే వస్తున్నాడు’ అనుకొన్నా. కానీ తను డబ్బు చూసుకొని రాలేదు. సినిమాలపై ప్రేమతో ఈ రంగంలోకి అడుగుపెట్టాడు. దర్శకుడు సెబాస్టియన్‌ గురించి చాలా విన్నా. ప్రతికూల పరిస్థితిల్లో ఈ సినిమాని పూర్తి చేశార’’న్నారు. ‘‘ఈ సినిమాలో అద్భుతమైన కథ, విజువల్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి కథ కూడా ఉంది. సినిమాపై నమ్మకంతో ఈ మాట చెబుతున్నా. కాదని సినిమా చూసిన ప్రేక్షకులకు అనిపిస్తే టికెట్‌ డబ్బులతో పాటు పాప్‌ కార్న్‌కి అయిన ఖర్చు కూడా వెనక్కి ఇచ్చేస్తామ’’ని రక్షిత్‌ తెలిపారు. ‘‘ప్రతి ఫ్రేమ్‌ కొత్తగా ఉండాలని ఈ సినిమా తీశాం. ఫస్టాఫ్‌ బాగా నవ్విస్తుంద’’న్నారు దర్శకుడు.

Updated Date - 2023-10-25T01:34:37+05:30 IST