స్టూడెంట్‌ రెడీ అయ్యాడు

ABN , First Publish Date - 2023-05-27T03:11:17+05:30 IST

బెల్లంకొండ గణేశ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘నేను స్డూడెంట్‌ సార్‌’. రాఖీ ఉప్పలపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

స్టూడెంట్‌ రెడీ అయ్యాడు

బెల్లంకొండ గణేశ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘నేను స్డూడెంట్‌ సార్‌’. రాఖీ ఉప్పలపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అవంతిక దస్సాని కథానాయిక. సముద్రఖని కీలక పాత్ర పోషించారు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రాన్ని జూన్‌ 2న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ‘నాంది’ సతీశ్‌ వర్మ మాట్లాడుతూ ‘‘ఓ కొత్త పాయింట్‌తో తీర్చిదిద్దిన చిత్రమిది. సెల్‌ ఫోన్‌ చుట్టూ కథ నడుస్తుంది. ఆ సెల్‌ఫోన్‌ లో ఏముంది? దాని చుట్టూ ఎలాంటి పరిణామాలు సంభవించాయి? అనేవి ఆసక్తికరంగా తీర్చిదిద్దాం. ఇప్పటి వరకూ విడుదల చేసిన టీజర్‌, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. పాటలూ అలరిస్తున్నాయ’’న్నారు.

Updated Date - 2023-05-27T03:11:24+05:30 IST