నయనతార గాడ్‌

ABN , First Publish Date - 2023-10-12T03:28:55+05:30 IST

‘తని ఒరువన్‌’ లాంటి సెన్సేషన్‌ బ్లాక్‌బస్టర్‌ తర్వాత జయం రవి, నయనతార జంటగా నటించిన చిత్రం ‘గాడ్‌’. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌కు ఐ. అహ్మద్‌ దర్శకత్వం వహించారు..

నయనతార గాడ్‌

‘తని ఒరువన్‌’ లాంటి సెన్సేషన్‌ బ్లాక్‌బస్టర్‌ తర్వాత జయం రవి, నయనతార జంటగా నటించిన చిత్రం ‘గాడ్‌’. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌కు ఐ. అహ్మద్‌ దర్శకత్వం వహించారు. ఆశిష్‌ విద్యార్థి కీలకపాత్ర పోషించారు. సుధన్‌ సుందరం, జి. జయరాం, సీహెచ్‌ సతీ్‌షకుమార్‌ నిర్మించారు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం ‘గాడ్‌’ పేరుతో తెలుగులో ఈ నెల 13న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘తమిళంలో విజయవంతమైన ‘ఇరైవన్‌’ చిత్రాన్ని తెలుగులో ‘గాడ్‌’ పేరుతో విడుదల చేస్తున్నాం. జయం రవి, నయనతార నటన సినిమాకు ప్రధానాకర్షణ. సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌గా ఇది ప్రేక్షకులను మెప్పిస్తుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా. సినిమాటోగ్రఫీ: హరి వేదాంతం

Updated Date - 2023-10-12T03:28:55+05:30 IST