‘నాయకుడు’ వస్తున్నాడు

ABN , First Publish Date - 2023-07-07T23:54:18+05:30 IST

ఈ మధ్య డబ్బింగ్‌ చిత్రాలు తెలుగులో మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. ఆ స్ఫూర్తితో మరిన్ని అనువాద చిత్రాలు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

‘నాయకుడు’ వస్తున్నాడు

ఈ మధ్య డబ్బింగ్‌ చిత్రాలు తెలుగులో మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. ఆ స్ఫూర్తితో మరిన్ని అనువాద చిత్రాలు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా తమిళంలో విజయవంతమైన ‘మామన్నన్‌’ చిత్రాన్ని తెలుగులో ‘నాయకుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్‌, వడివేలు, ఫహద్‌ ఫాజిల్‌, కీర్తి సురేశ్‌ ప్రఽధాన పాత్రలు పోషించిన చిత్రమిది. మరి సెల్వరాజ్‌ దర్శకుడు. ఈనెల 14న ఏషియన్‌ మల్టీప్లెక్స్‌, సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా తెలుగులో విడుదల చేస్తున్నాయి. శుక్రవారం రాజమౌళి, మహేశ్‌బాబు చేతుల మీదుగా ట్రైలర్‌ ఆవిష్కరించారు. ‘‘రాజకీయ నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌ ఇది. ప్రతీ పాత్రా కథలో కీలకమే. ఫహద్‌ ఫాజిల్‌, కీర్తిల నటన మరింత ఆకట్టుకొంటుంద’’ని దర్శకుడు తెలిపారు. సంగీతం: ఏ.ఆర్‌.రెహమాన్‌.

Updated Date - 2023-07-07T23:54:18+05:30 IST