నయా చంద్రముఖి

ABN , First Publish Date - 2023-08-06T03:05:02+05:30 IST

లారెన్స్‌, కంగనా రనౌత్‌ కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘చంద్రముఖి 2’. పి.వాసు దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు...

నయా చంద్రముఖి

లారెన్స్‌, కంగనా రనౌత్‌ కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘చంద్రముఖి 2’. పి.వాసు దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. ఇటీవలే లారెన్స్‌ లుక్‌ విడుదల చేశారు. ఇప్పుడు చంద్రముఖి అవతారంలో కంగనా దర్శనమిచ్చింది. ఒంటి నిండా ఆభరణాలు, పట్టు వస్త్రాలతో రాజ నర్తకి చంద్రముఖిగా కంగనా లుక్‌ ఆకట్టుకొంటోంది. ‘‘2005లో విడుదలైన ‘చంద్రముఖి’ ఎంత పెద్ద విజయాన్ని అందుకొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. వాటిని తప్పకుండా అందుకొంటాం’’ అని దర్శక నిర్మాతలు తెలిపారు. సంగీతం: కీరవాణి.

Updated Date - 2023-08-06T03:05:02+05:30 IST