కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NANI : రగ్గడ్‌ లుక్‌లో నాని

ABN, Publish Date - Dec 28 , 2023 | 01:29 AM

హీరో నాని, దర్శకుడు వివేక్‌ ఆత్రేయ రెండో సారి కలసి పని చేస్తున్న ‘‘సరిపోదా శనివారం’ చిత్రం తాజా షెడ్యూల్‌ బుధవారం మొదలైంది. ఈ చిత్రంలో నాని పూర్తి స్థాయి యాక్షన్‌ పాత్ర పోషిస్తున్నారు...

హీరో నాని, దర్శకుడు వివేక్‌ ఆత్రేయ రెండో సారి కలసి పని చేస్తున్న ‘‘సరిపోదా శనివారం’ చిత్రం తాజా షెడ్యూల్‌ బుధవారం మొదలైంది. ఈ చిత్రంలో నాని పూర్తి స్థాయి యాక్షన్‌ పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘గత నెలలో ఒక షెడ్యూల్‌ పూర్తి చేశాం. బుధవారం నుంచి కొత్త షెడ్యూల్‌ ప్రారంభించాం. లెంగ్తీ షెడ్యూల్‌ ఇది. యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా కొంత టాకీ పార్ట్‌ కూడా చిత్రీకరిస్తాం. ఈ సినిమాలో నాని రగ్గడ్‌ లుక్‌లో కనిపించి, అందరినీ అలరిస్తారు’ అని నిర్మాతలు చెప్పారు. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్‌.జె.సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. జేక్స్‌ బిజోయ్‌ సంగీతాన్ని సమకూరుస్తుండగా, మురళీ జి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు.

Updated Date - Dec 28 , 2023 | 01:29 AM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!