మీ ఓటు నా(ని)కే

ABN , First Publish Date - 2023-11-18T00:58:01+05:30 IST

‘కాదేదీ ప్రచారానికి అనర్హం..’ అన్నారు సినీ పెద్దలు. సినిమా ప్రచారం కోసం కొత్త కొత్తగా ఆలోచిస్తున్నారు.

మీ ఓటు నా(ని)కే

‘కాదేదీ ప్రచారానికి అనర్హం..’ అన్నారు సినీ పెద్దలు. సినిమా ప్రచారం కోసం కొత్త కొత్తగా ఆలోచిస్తున్నారు. యువ హీరో నాని కూడా అదే చేస్తున్నాడు. తన కొత్త సినిమా ‘హాయ్‌ నాన్న’ డిసెంబరులో విడుదల కానుంది. ఈలోగా ప్రమోషన్లు కూడా మొదలెట్టేశారు. ప్రస్తుతం ఎలక్షన్ల సీజన్‌ కదా? అందుకే ఫక్తు పొలిటికల్‌ లీడర్‌లా మారిపోయాడు నాని. అచ్చంగా రాజకీయ నాయకుడ్ని తలపించే గెట్‌పతో దర్శనమిచ్చాడు. ఖద్దరు చొక్కా, కండువాతో ‘మీ ప్రేమ మరియు ఓటు మాకే అవ్వాలని’ అంటూ ఓ ఫొటో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఎన్నికల హంగామా నడుస్తోందని, అందుకే ఈ గెటప్‌ వేశానని నాని కామెంట్‌ పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ పిక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నాని, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన ‘హాయ్‌ నాన్న’ డిసెంబరు 7న రాబోతోంది. ఈ చిత్రంలో విరాజ్‌ అనే పాత్రలో కనిపించనున్నాడు నాని.

Updated Date - 2023-11-18T00:58:02+05:30 IST