నాని... క్రిస్మస్ కానుక
ABN , First Publish Date - 2023-04-17T03:58:00+05:30 IST
ఈ వేసవిలో ‘దసరా’తో అలరించారు నాని. ఈ చిత్రం వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ఈలోగా... మరో సినిమా పనిలో పడిపోయారు. కొత్త కుర్రాడు శౌర్య దర్శకత్వంలో నాని ఓ సినిమా చేస్తున్నారు ‘సీతారామం’తో ఆకట్టుకొన్న...

ఈ వేసవిలో ‘దసరా’తో అలరించారు నాని. ఈ చిత్రం వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ఈలోగా... మరో సినిమా పనిలో పడిపోయారు. కొత్త కుర్రాడు శౌర్య దర్శకత్వంలో నాని ఓ సినిమా చేస్తున్నారు ‘సీతారామం’తో ఆకట్టుకొన్న మృణాల్ ఠాకూర్ కథానాయిక. నానికి ఇది 30వ సినిమా. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబరు 21న విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకొంది. ఈ సందర్భంగా నిర్మాత చెరుకూరి మోహన్ మాట్లాడుతూ ‘‘తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే సినిమా ఇది. నానిలోని క్లాస్ మరోసారి బయటకు వస్తుంది. చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం గోవాలో కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నామ’’న్నారు.