సంక్రాంతికి నాగ్‌ జాతర

ABN , First Publish Date - 2023-08-30T04:57:06+05:30 IST

మంగళవారం అక్కినేని నాగార్జున పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమాకి సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘నాసామి రంగ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు...

సంక్రాంతికి నాగ్‌ జాతర

మంగళవారం అక్కినేని నాగార్జున పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమాకి సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘నాసామి రంగ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. కరుణ కుమార్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫస్ట్‌ గ్లింప్స్‌లో నాగ్‌ లుక్‌, ఆయన స్టైల్‌ ఆకట్టుకొనేలా ఉన్నాయి. ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. కథ, మాటలు: ప్రసన్నకుమార్‌ బెజవాడ.

శేఖర్‌ కమ్ముల చిత్రంలో..

ధనుష్‌ కథానాయకుడిగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. రష్మిక కథానాయిక. ఈ చిత్రంలో నాగ్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని మంగళవారం చిత్రబృందం ఖరారు చేసింది. నాగ్‌తో పని చేయడం సంతోషంగా ఉందని, ఆయనతో మళ్లీ మళ్లీ పనిచేయాలని ఉందని నిర్మాతలు సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్‌ మోహన్‌ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

Updated Date - 2023-08-30T04:57:06+05:30 IST