టైటిల్‌ సాంగ్‌ చిత్రీకరణలో నా సామిరంగా

ABN , Publish Date - Dec 22 , 2023 | 05:19 AM

అక్కినేని నాగార్జున నటిస్తున్న మాస్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘నా సామిరంగా’ షూటింగ్‌ చివరి దశలో ఉంది. ప్రస్తుతం భారీ సెట్‌ వేసి టైటిల్‌ సాంగ్‌ చిత్రీకరిస్తున్నారు,,,

టైటిల్‌ సాంగ్‌ చిత్రీకరణలో నా సామిరంగా

అక్కినేని నాగార్జున నటిస్తున్న మాస్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘నా సామిరంగా’ షూటింగ్‌ చివరి దశలో ఉంది. ప్రస్తుతం భారీ సెట్‌ వేసి టైటిల్‌ సాంగ్‌ చిత్రీకరిస్తున్నారు. చంద్రబోస్‌ రాసిన ఈ పాటకు కీరవాణి సంగీతం అందించారు. ఈ మాస్‌ నంబర్‌లో అల్లరి నరేశ్‌, రాజ్‌ తరుణ్‌ సహా 300 మంది డాన్సర్లు పాల్గొంటున్నారు. దినేశ్‌ మాస్టర్‌ కొరియోగ్రాఫర్‌. నాగార్జున, నరేశ్‌, రాజ్‌ తరుణ్‌లపై చిత్రీకరిస్తున్న ఈ పాట థియేటర్స్‌లో ప్రేక్షకులతో విజిల్స్‌ వేయిస్తుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. నాగార్జున సరసన ఆషికా రంగనాథ్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్ర్కీన్స్‌ బేనరుపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్‌కుమార్‌ సమర్పిస్తున్న ఈ చిత్రానికి విజయ్‌ బిన్ని దర్శకుడు.

Updated Date - Dec 22 , 2023 | 05:19 AM