ఆల్‌టైమ్‌ నా ఫేవరేట్‌ మూవీ

ABN , First Publish Date - 2023-10-19T00:14:09+05:30 IST

రవితేజ హీరోగా వంశీకృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ బుధవారం మీడియాతో ముచ్చటించారు...

ఆల్‌టైమ్‌ నా ఫేవరేట్‌ మూవీ

రవితేజ హీరోగా వంశీకృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ బుధవారం మీడియాతో ముచ్చటించారు. ఆ వివరాలు..

  • సాధారణంగా రాజకీయ నాయకులు, క్రీడాకారులు, ఇతర ప్రముఖులపై బయోపిక్స్‌ తీస్తుంటారు. కానీ ఒక దొంగ బయోపిక్‌ ఎందుకు తీశామో ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది. అన్‌టోల్డ్‌ స్టోరీస్‌ చెప్పాలన్నది మా సంస్థ ఆశయం. ఒక మనిషి దొంగ ఎందుకయ్యాడు, ఆ తర్వాత ఏం చేశాడు.. అనే అంశాలు ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రంలో ఉంటాయి. పవర్‌ఫుల్‌ కంటెంట్‌ ఉన్న సినిమా ఇది.

  • పండగలకి రెండు మూడు పెద్ద సినిమాలు రావడం సహజమే. మా చిత్రం కంటెంట్‌పై ఎంతో నమ్మకం ఉంది. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాం. ఉత్తరాదిలో అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది.

  • ఈ సినిమాకు రవితేజగారు ఎంతో సపోర్ట్‌ చేశారు. చాలా హార్డ్‌ వర్క్‌ చేశారు. యాక్షన్‌ సీక్వెన్స్‌ చేస్తున్నప్పుడు చేతికి గాయమైనా షూటింగ్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సహకరించారు. నా కెరీర్‌లో ఆల్‌టైమ్‌ ఫేవరేట్‌ మూవీగా ‘టైగర్‌ నాగేశ్వరరావు’ నిలిచిపోతుంది. త్వరలో మరో బయోపిక్‌ చేస్తున్నాం. అది కూడా ఆశ్చర్యపరిచేలా ఉంటుంది.

  • నిర్మాణరంగంలోకి నేను అడుగుపెట్టిన మూడేళ్లలోనే జాతీయ అవార్డ్‌ అందుకోవడం మా సంస్థకు ఎంతో గౌరవాన్ని తెచ్చింది. అందుకే అవార్డ్‌ అందుకుంటున్నప్పుడు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి.

  • అనుపమ్‌ ఖేర్‌ మా లక్కీ ఛార్మ్‌. ఆయన నన్ను సొంత బిడ్డలా చూస్తారు. ఏదైనా పాత్ర చేయాలని అడిగినా వెంటనే ఓకే అనేస్తారు. ఆయనకు నాపై అంత నమ్మకం ఉండడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.

Updated Date - 2023-10-19T00:14:09+05:30 IST