నా కల నెరవేరింది

ABN , Publish Date - Dec 29 , 2023 | 12:51 AM

‘నటుడు కావాలనేది చిన్నప్పటినుంచి నా కల. సినిమాను ముందుకు తీసుకెళ్లే కథానాయకుడిగా చేయాలనే కోరిక. అది ‘బబుల్‌గమ్‌’ చిత్రంతో నెరవేరింది. దర్శకుడు రవికాంత్‌ పేరెపుని కలవడం, ఆయనకి నాతో సినిమా చేయాలని...

నా కల నెరవేరింది

‘నటుడు కావాలనేది చిన్నప్పటినుంచి నా కల. సినిమాను ముందుకు తీసుకెళ్లే కథానాయకుడిగా చేయాలనే కోరిక. అది ‘బబుల్‌గమ్‌’ చిత్రంతో నెరవేరింది. దర్శకుడు రవికాంత్‌ పేరెపుని కలవడం, ఆయనకి నాతో సినిమా చేయాలని అనిపించడంతో ఈ ప్రయాణం మొదలైంది’ అన్నారు కొత్త హీరో రోషన్‌ కనకాల. ఆయన్ని హీరోగా పరిచయం చేస్తూ రవికాంత్‌ పేరెపు దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ప్యాక్టరీ, మహేశ్వరి మూవీస్‌ సంస్థలు నిర్మించిన ‘బబుల్‌గమ్‌’ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా రోషన్‌ మీడియాకు చిత్ర విశేషాలు వెల్లడించారు.

  • ‘నా బాల్యం అంతా దాదాపు తాతగారి యాక్ష్టింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లోనే గడిచింది. ఫస్ట్‌ ఫ్లోర్‌లో మేం ఉంటే ఇన్‌స్టిట్యూట్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉండేది. అందుకే చిన్నప్పటి నుంచి నటన అంటే ఆసక్తి కలిగింది. పెరిగి పెద్దయ్యాక తాతగారి దగ్గర రెండు నెలలు శిక్షణ తీసుకున్నా. తర్వాత లాస్‌ ఏంజెల్స్‌ వెళ్లి శిక్షణ పొందాను. నటన విషయంలో నాన్న నన్ను బాగా గైడ్‌ చేశారు. ‘బబుల్‌గమ్‌’ షూటింగ్‌ మొదలు పెట్టడానికి ముందు వర్క్‌షాప్‌ చేయాలని ముందే అనుకున్నాం. ఏ సీన్‌లో ఎలా చేయాలి, ఎలాంటి ఎమోషన్స్‌ కన్వే అవ్వాలి, కాస్ట్యూమ్స్‌ ఎలా ఉండాలి.. ఇవన్నీ ప్రిపేర్‌ అయ్యాం. ఇది షూటింగ్‌లో మాకు హెల్ప్‌ అయింది’ అని చెప్పారు రోషన్‌.

  • ‘తొలి సారిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు ప్రెషర్‌ కంటే ప్లజర్‌ ఉంది. జీవితంలో కోరుకున్నది ఇదే కనుక చాలా ఆనందంగా ఉంది. సినిమా మీద పూర్తి నమ్మకం ఉంది’ అన్నారాయన.

  • అమ్మానాన్నలు ఏమైనా సూచనలు ఇచ్చారా అని అడిగితే ‘నటనాపరంగా వారి నుంచి సలహాలు తీసుకున్నా. ఏదన్నా సందేహం ఉంటే అడిగాను. వాళ్లిద్దరు సినిమా చూసినప్పుడు నేను అక్కడ లేను. నాన్న కొన్ని సీన్స్‌లో ఏడ్చారని అమ్మ చెప్పింది. నాన్న సహజంగా మెచ్చుకోరు. ఆయన నుంచి కాంప్లిమెంట్‌ రావడం ఆనందంగా అనిపించింది’ అని చెప్పారు. హీరోయిన్‌ మానస గురించి చెబుతూ ‘ఆమె పెర్ఫార్మెన్స్‌ చూసి ఆశ్చర్యపోయాను. డబ్బింగ్‌ కూడా తనే చెప్పింది. ఎలాంటి ఈగోలు లేకుండా సెట్‌లో ఫ్రెండ్లీగా ఉండేది’ అన్నారు రోషన్‌.

  • అవకాశం ఇచ్చిన చిత్ర నిర్మాతలు విశ్వప్రసాద్‌, వివేక్‌లకు కృతజ్ఞతలు తెలుపుతూ ‘వాళ్లు చాలా సపోర్ట్‌ చేశారు. కథను బలంగా నమ్మి అడిగినవన్నీ సమకూర్చారు’ అని చెప్పారు.

Updated Date - Dec 29 , 2023 | 12:51 AM