కీడాకోలాతో నా కల నిజమైంది

ABN , First Publish Date - 2023-11-01T03:20:11+05:30 IST

‘పెళ్లిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ లాంటి విభిన్న చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకున్నారు తరుణ్‌ భాస్కర్‌ దాస్యం. ఆయన రూపొందించిన తాజా చిత్రం ‘కీడా కోలా’...

కీడాకోలాతో నా కల నిజమైంది

‘పెళ్లిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ లాంటి విభిన్న చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకున్నారు తరుణ్‌ భాస్కర్‌ దాస్యం. ఆయన రూపొందించిన తాజా చిత్రం ‘కీడా కోలా’. నవంబర్‌ 3న విడుదలవుతోంది. ఈ సందర్భంగా తరుణ్‌ భాస్కర్‌ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

  • రకరకాల మోసాలతో డబ్బులు సంపాదిస్తున్నారు. ప్రతి క్రైమ్‌ను దూరం నుంచి చూస్తే కొంత కామెడీగానే అనిపిస్తుంది అనే ఆలోచన నుంచి ‘కీడా కోలా’ కథ పుట్టింది. ఈ సినిమాతో క్రైమ్‌కామెడీ సినిమా తీయాలనే నా కల నిజమైంది. నా గత చిత్రాల్లో వాస్తవికత పాళ్లు ఎక్కువ. ఇందులో మాత్రం చాలా సినిమాటిక్‌ లిబర్టీ తీసుకున్నాను.

  • ముంబైలో ప్రివ్యూ వేశాం. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు నవ్వుతూనే ఉన్నారు. కచ్చితంగా ప్రేక్షకులు పైసా వసూల్‌ చిత్రం అని భావిస్తారు.

  • ఇందులో నటీనటులందరినీ ఆడిషన్స్‌ చేసిన తర్వాతే తీసుకున్నాం. బ్రహ్మానందం, రఘుగారు పాత్రలు ప్రేక్షకులను అలరిస్తాయి. నాయుడు అనే పాత్ర నేను పోషించాను. ఈ సినిమా కోసం నేను సృష్టించిన పాత్రల్లో ఇది నాకు చాలా నచ్చింది.

  • సినిమాలో ముఖ్యమైన పాత్రలు ఎనిమిది ఉన్నాయి. ఇందులో హీరో ఎవ రనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. ప్రేక్షకులు ఎవరిని హీరోగా భావిస్తారో చూడాలి. వెంకటేశ్‌ గారితో చేసే సినిమా కోసం కథ సిద్ధం చేస్తున్నాను. వెబ్‌సిరీస్‌ కూడా చేస్తున్నాను.

Updated Date - 2023-11-01T03:20:11+05:30 IST