‘దసరా’తో నా కెరీర్ మలుపు తిరిగింది
ABN , First Publish Date - 2023-03-12T01:45:54+05:30 IST
నాని కథానాయకుడిగా నటించిన చిత్రం ‘దసరా’. ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి ఓ కీలక పాత్ర పోషించారు. ఈనెల 30న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా దీక్షిత్ శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘ఈ సినిమాలో సూరిగా నటించా...

నాని కథానాయకుడిగా నటించిన చిత్రం ‘దసరా’. ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి ఓ కీలక పాత్ర పోషించారు. ఈనెల 30న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా దీక్షిత్ శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘ఈ సినిమాలో సూరిగా నటించా. సినిమా మొత్తం తెలంగాణ యాసలో మాట్లాడతా. కథలో చాలా ప్రాధాన్యం ఉన్న పాత్ర ఇది. కథానాయకుడి ప్రాణ స్నేహితుడిలా కనిపిస్తా. ఇలాంటి అవకాశం రావడమే గొప్ప. ఈ సినిమాతో నా కెరీర్ మలుపు తిరిగినట్టే. ‘దసరా’ సెట్స్‌పై ఉండగానే మరో మూడు చిత్రాల్లో నాకు అవకాశం వచ్చింది. నానితో కలిసి నటించడం మర్చిపోలేని అనుభూతి. ఆయన్ని నేచురల్ స్టార్ అని ఎందుకు అంటారో సెట్లో ఆయన్ని గమనిస్తే అర్థం అవుతుంది. దర్శకుడు శ్రీకాంత్ ఒదెలకు చాలా క్లారిటీ ఉంది. ఏ పాత్ర నుంచి ఏం కావాలో ఆయనకు స్పష్టంగా తెలుసు. ఆయన ఊహల్లో అనుకొన్న పాత్రని తెరపై రావడానికి నా వంతు కృషి చేశాను. ‘దసరా’ పాటలన్నీ సూపర్ హిట్టయ్యాయి. కన్నడలో కూడా ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా పెద్ద హిట్టవుతుందన్న నమ్మకం ఉంద’’న్నారు.