Music University headed by Ilayaraja : ఇళయరాజా నేతృత్వంలో మ్యూజిక్‌ యూనివర్సిటీ

ABN , First Publish Date - 2023-05-07T03:43:22+05:30 IST

‘ఇళయరాజాగారికి నేను పెద్ద అభిమానిని. ‘మ్యూజిక్‌ స్కూల్‌’ సినిమా వల్ల మ్యూజిక్‌ యూనివర్సిటీలాంటి ఆయన పక్కన నిలబడే అవకాశం దక్కింది. ఇళయరాజాగారు తెలంగాణలో మ్యూజిక్‌ యూనివర్సిటీని...

Music University headed by Ilayaraja : ఇళయరాజా నేతృత్వంలో మ్యూజిక్‌ యూనివర్సిటీ

‘ఇళయరాజాగారికి నేను పెద్ద అభిమానిని. ‘మ్యూజిక్‌ స్కూల్‌’ సినిమా వల్ల మ్యూజిక్‌ యూనివర్సిటీలాంటి ఆయన పక్కన నిలబడే అవకాశం దక్కింది. ఇళయరాజాగారు తెలంగాణలో మ్యూజిక్‌ యూనివర్సిటీని లీడ్‌ చేయాలని కోరుతున్నాను. ఆయన అంగీకరిస్తే గౌరవంగా భావిస్తాను’ అని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. శ్రియాశరణ్‌, ప్రకాశ్‌రాజ్‌, శర్మన్‌జోషీ ప్రధానపాత్రల్లో పాపారావు బియ్యాల దర్శకత్వం వహించిన ‘మ్యూజిక్‌ స్కూల్‌’ చిత్రం ఈ నెల 12న విడుదలవుతోంది. శనివారం నిర్వహించిన ప్రీ రిలీజ్‌ కార్యక్రమంలో కేటీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘శ్రియ, షాన్‌, దిల్‌రాజుకు అభినందనలు. ట్రైలర్‌ చూస్తుంటే మంచి సినిమా తీశారనిపిస్తోంది. పాపారావు బియ్యాల నాకు ఆత్మీయులు. నేటి సమాజంలో పిల్లల సృజనను ఎలా చంపేస్తున్నారనే మంచి సందేశంతో ఆయన ఈ సినిమా తీశారు’ అని అభినందించారు. ఇళయరాజా మాట్లాడుతూ ‘కేటీఆర్‌ ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నాను. ఆయన చెప్పినట్లు ఇక్కడ మ్యూజిక్‌ యూనివర్సిటీ వస్తే, 200 మంది ఇళయరాజాలను తయారుచేస్తాను’ అన్నారు. ‘మ్యూజిక్‌ స్కూల్‌’ ఓ బ్యూటిఫుల్‌ మూవీ అని శ్రియా శరణ్‌ చెప్పారు. ఓ మంచి సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉందన్నారు దిల్‌రాజు.

Updated Date - 2023-05-07T03:43:22+05:30 IST