మ్యూజిక్‌ ప్రమోషన్స్‌ షురూ

ABN , First Publish Date - 2023-09-09T04:21:20+05:30 IST

మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘నాయాట్టు’ చిత్రాన్ని జీఏ 2 పిక్చర్స్‌ సంస్థ ‘కోట బొమ్మాళి పీ.ఎస్‌’ పేరుతో తెలుగులో రీమేక్‌ చేస్తోంది. శ్రీకాంత్‌ మేకా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.

మ్యూజిక్‌ ప్రమోషన్స్‌ షురూ

మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘నాయాట్టు’ చిత్రాన్ని జీఏ 2 పిక్చర్స్‌ సంస్థ ‘కోట బొమ్మాళి పీ.ఎస్‌’ పేరుతో తెలుగులో రీమేక్‌ చేస్తోంది. శ్రీకాంత్‌ మేకా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘జోహార్‌’, ‘అర్జున ఫాల్గుణ’ చిత్రాలకు దర్శకత్వం వహించిన తేజ మార్ని ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే విడుదలైన మోషన్‌ పోస్టర్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఇప్పుడు మ్యూజిక్‌ ప్రమోషన్స్‌ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ నెల 11న సినిమాలోని శ్రీకాకుళం ఫోక్‌లోర్‌ సాంగ్‌ను విడుదల చేయనున్నారు. ఈ పాట ప్రేక్షకుల్ని అలరిస్తుందని దర్శకనిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: రంజిన్‌ రజ్‌, మిధున్‌ ముకుందన్‌, నిర్మాతలు: బన్నీ వాసు, విద్యా కొప్పినీడి

Updated Date - 2023-09-09T04:21:20+05:30 IST