కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Actor Ajay : మర్డర్‌ మిస్టరీ ‘చక్రవ్యూహం’

ABN, First Publish Date - 2023-05-13T05:55:49+05:30

నటుడు అజయ్‌ ప్రధాన పాత్రలో నటించిన మర్డర్‌ మిస్టరీ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘చక్రవ్యూహం’ వచ్చే నెల

టుడు అజయ్‌ ప్రధాన పాత్రలో నటించిన మర్డర్‌ మిస్టరీ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘చక్రవ్యూహం’ వచ్చే నెల రెండున విడుదల కానుంది. ‘ద ట్రాప్‌’ అనేది ఉప శీర్షిక. చెట్కూరి మధుసూదన్‌ దర్శకత్వంలో సావిత్రి నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను గ్రాండ్‌గా రిలీజ్‌ చేశారు. నిముషం నిడివితో ఉన్న ఈ టీజర్‌ మొదటి నుంచి చివరి వరకూ ఆసక్తికరంగా ఉంది అద్భుతమైన విజువల్స్‌, అదరగొట్టే నేపథ్య సంగీతంతో ఈ టీజర్‌ ఆకట్టుకుంది. ‘అజయ్‌ ఇందులో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆపీసర్‌గా నటించారు. అందరూ సపోర్ట్‌ చేయడంతో సినిమా బాగా వచ్చింది’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు : వెంకటేశ్‌, అనూష.

Updated Date - 2023-10-27T14:45:41+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!