Actor Ajay : మర్డర్ మిస్టరీ ‘చక్రవ్యూహం’
ABN , First Publish Date - 2023-05-13T05:55:49+05:30 IST
నటుడు అజయ్ ప్రధాన పాత్రలో నటించిన మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ‘చక్రవ్యూహం’ వచ్చే నెల

నటుడు అజయ్ ప్రధాన పాత్రలో నటించిన మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ‘చక్రవ్యూహం’ వచ్చే నెల రెండున విడుదల కానుంది. ‘ద ట్రాప్’ అనేది ఉప శీర్షిక. చెట్కూరి మధుసూదన్ దర్శకత్వంలో సావిత్రి నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. నిముషం నిడివితో ఉన్న ఈ టీజర్ మొదటి నుంచి చివరి వరకూ ఆసక్తికరంగా ఉంది అద్భుతమైన విజువల్స్, అదరగొట్టే నేపథ్య సంగీతంతో ఈ టీజర్ ఆకట్టుకుంది. ‘అజయ్ ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆపీసర్‌గా నటించారు. అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు : వెంకటేశ్, అనూష.