వెండి తెరపై మురళీధరన్‌ మాయాజాలం

ABN , First Publish Date - 2023-04-18T03:22:37+05:30 IST

బంతితో అద్భుతాలు సృష్టించిన బౌలర్‌ ముత్తయ్య మురళీధరన్‌ కథ.. ఇప్పుడు వెండి తెరపై రాబోతోంది. ‘800’ పేరుతో మూవీ ట్రైన్‌ మోషన్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ‘స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌’ ఫేమ్‌...

వెండి తెరపై మురళీధరన్‌ మాయాజాలం

బంతితో అద్భుతాలు సృష్టించిన బౌలర్‌ ముత్తయ్య మురళీధరన్‌ కథ.. ఇప్పుడు వెండి తెరపై రాబోతోంది. ‘800’ పేరుతో మూవీ ట్రైన్‌ మోషన్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ‘స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌’ ఫేమ్‌ మధుర్‌ మిట్టల్‌ మురళీధరన్‌గా కనిపించబోతున్నాడు. ఎం.ఎస్‌.శ్రీపతి దర్శకుడు. వివేక్‌ రంగాచారి నిర్మాత. సోమవారం ముత్తయ్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘800’ ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది. ‘‘ఇది ఓ క్రికెటర్‌ కథ మాత్రమే కాదు. జీవితంలో ఏమైనా సాధించగలం అని నిరూపించగల ఓ వ్యక్తి కథ. మురళీ జీవితానికి సంబంధించిన అనేక కోణాల్ని వెండి తెరపై చూపించబోతున్నాం. రాబోతున్న తరాలకు మురళీ కథ ఆదర్శవంతంగా నిలుస్తుంద’’న్నారు దర్శక నిర్మాతలు.

Updated Date - 2023-04-18T03:22:41+05:30 IST