అక్టోబర్‌లో 800
ABN , First Publish Date - 2023-08-23T01:57:19+05:30 IST
దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘800’. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా ఆయన చరిత్ర సృష్టించారు...

దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘800’. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా ఆయన చరిత్ర సృష్టించారు. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేం మధుర్ మిట్టల్ నటిస్తున్నారు. మురళీధరన్ భార్య మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటిస్తున్నారు. ఎం.ఎస్ శ్రీపతి దర్శకత్వం వహిస్తున్నారు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. బుకర్‌ప్రైజ్ పురస్కార గ్రహీత షెహన్ కరుణతిలకతో కలసి ఆయన స్ర్కిప్ట్ అందించారు. ‘800’ ఆలిండియా పంపీణీ హక్కులను నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మురళీధరన్ బాల్యం నుంచి పడిన ఇబ్బందులు, క్రికెట్‌లో ఆయన సాధించిన విజయాల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. జాతీయ స్థాయిలో ‘800’ను పంపిణీ చేసే అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉంది. ట్రైలర్‌ను సెప్టెంబర్‌లో, సినిమాను అక్టోబర్‌లో విడుదల చేస్తామ’న్నారు. తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు సహా పలు భారతీయ భాషల్లో విడుదల చేస్తున్నారు.