దేవరలో మున్నాభాయ్?
ABN , First Publish Date - 2023-11-21T00:32:37+05:30 IST
బాలీవుడ్ అంతా ‘మున్నాభాయ్’ అంటూ ప్రేమగా పిలుచుకొనే నటుడు సంజయ్‌దత్. ఈమధ్య సౌత్ సినిమాలపై దృష్టి పెట్టారు...

బాలీవుడ్ అంతా ‘మున్నాభాయ్’ అంటూ ప్రేమగా పిలుచుకొనే నటుడు సంజయ్‌దత్. ఈమధ్య సౌత్ సినిమాలపై దృష్టి పెట్టారు. ‘కేజీఎఫ్’, ‘లియో’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. వాటికి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు మరో సినిమాపై సంతకం చేసినట్టు టాక్. ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో ‘దేవర’ రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ కీలకమైన పాత్ర కోసం మున్నాభాయ్‌ని సంప్రదించారని టాక్. ఈ చిత్రంలో ఇప్పటికే.. సైఫ్ అలీఖాన్ విలన్‌గా ఎంపికయ్యారు. మరి సంజయ్ ఎలాంటి పాత్రలో కనిపిస్తారన్నది ఆసక్తిగా మారింది. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ‘దేవర’ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. పార్ట్ 1 వచ్చే యేడాది వేసవిలో విడుదల కానుంది.