చిరూతో సై అన్నారా?

ABN , First Publish Date - 2023-09-07T02:12:17+05:30 IST

‘సీతారామం’ చిత్రంలో కథానాయికగా తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు మృణాల్‌ ఠాకూర్‌.

చిరూతో సై అన్నారా?

‘సీతారామం’ చిత్రంలో కథానాయికగా తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు మృణాల్‌ ఠాకూర్‌. ప్రస్తుతం వరుస చిత్రాలతో జోరుమీదున్న ఈ ముద్దుగుమ్మ మరో అరుదైన అవకాశాన్ని అందుకున్నారని సమాచారం. చిరంజీవి కథానాయకుడిగా ‘బింబిసార’ ఫేం వశిష్ఠ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో మృణాల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారని పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ చిత్రంలో నటన పరంగా ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో మృణాల్‌ అయితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోందట. మరి ఆమె ఈ చిత్రం అంగీకరించారా లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Updated Date - 2023-09-07T02:12:17+05:30 IST