మిస్టర్ కింగ్ ముస్తాబు
ABN , First Publish Date - 2023-02-13T00:40:17+05:30 IST
నటి, దర్శకురాలు విజయ నిర్మల మనవడు శరణ్‌కుమార్ హీరోగా శశిధర్ చావలి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ కింగ్’...

నటి, దర్శకురాలు విజయ నిర్మల మనవడు శరణ్‌కుమార్ హీరోగా శశిధర్ చావలి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ కింగ్’. బి.ఎన్. రావు నిర్మించారు. యశ్విక నిష్కల, ఊర్వీ సింగ్ కథానాయికలు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ‘టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా కోసం యూనిట్ అంతా చాలా కష్టపడింది. సునీల్, తనికెళ్ల భరణి, మురళీశర్మ లాంటి సీనియర్లతో పనిచేయడం గొప్ప అనుభవం. నా మొదటి సినిమాను ఆదరించాలి’ అని ప్రేక్షకులను కోరారు. ఆత్మగౌరవం ఉన్న అబ్బాయిలు, ఆడపిల్లలు ఉన్న ప్రతి కుటుంబం చూడాల్సిన సినిమా ఇదని శశిధర్ అన్నారు. ‘మిస్టర్ కింగ్’ సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉందని నిర్మాత చెప్పారు.