RAVITEJA : మిస్టర్‌ బచ్చన్‌ హంగామా..

ABN , Publish Date - Dec 29 , 2023 | 12:54 AM

‘మిరపకాయ్‌’ వంటి హిట్‌ తర్వాత ఇన్నాళ్లకు రవితేజ, హరీశ్‌శంకర్‌ కలిసి పనిచేయడం.. సినిమా పేరు ‘మిస్టర్‌ బచ్చన్‌’ అని అనౌన్స్‌ చేయడం.. ఈ రెండు కారణాలతో సినిమాపై అభిమానుల్లో అంచనాలు మొదలయ్యాయి. ’నామ్‌ తో సునాహోగా‘ అనే అమితాబ్‌ డైలాగ్‌...

RAVITEJA : మిస్టర్‌ బచ్చన్‌ హంగామా..

‘మిరపకాయ్‌’ వంటి హిట్‌ తర్వాత ఇన్నాళ్లకు రవితేజ, హరీశ్‌శంకర్‌ కలిసి పనిచేయడం.. సినిమా పేరు ‘మిస్టర్‌ బచ్చన్‌’ అని అనౌన్స్‌ చేయడం.. ఈ రెండు కారణాలతో సినిమాపై అభిమానుల్లో అంచనాలు మొదలయ్యాయి. ’నామ్‌ తో సునాహోగా‘ అనే అమితాబ్‌ డైలాగ్‌ ఉపశీర్షిక. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. హీరో రవితేజ ఈ రోజు షూట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షూటింగ్‌కి సంబంధించిన ఓ ఫొటోని రవితేజ స్వయంగా తన వ్యక్తగత సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. ఈ భారీ షెడ్యూల్‌లో ప్రధానపాత్రలపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని, అభిమానులను అలరించేలా ఇందులో రవితేజ కేరక్టరైజేషన్‌ ఉంటుందని చిత్రబృందం తెలిపింది. రవితేజ పూర్తి విభిన్నమైన లుక్‌తో కనిపించనున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఈ చిత్రానికి కెమెరా: అయనంక బోస్‌, సంగీతం: మిక్కీ జె.మేయర్‌, సహనిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, సమర్పణ: పనోరమా స్టూడియోస్‌, టీ సిరీస్‌.

Updated Date - Dec 29 , 2023 | 12:54 AM