మనీ.. సో మెనీ
ABN , First Publish Date - 2023-09-09T04:18:59+05:30 IST
వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సౌండ్ పార్టీ’. సంజయ్ శేరి దర్శకుడు. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్యామ్ గజేంద్ర నిర్మాతలు.

వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సౌండ్ పార్టీ’. సంజయ్ శేరి దర్శకుడు. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్యామ్ గజేంద్ర నిర్మాతలు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. తాజాగా చిత్రబృందం తొలి గీతాన్ని విడుదల చేసింది. ‘మని మని మనీ.. దీని ముఖములు సో మెనీ’ అంటూ సాగే ఈ గీతానికి పూర్ణాచారి సాహిత్యం అందించారు. మోహిత్ రెహమానిక్ మంచి బీట్‌తో కంపోజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘టీజర్, టైటిల్ ట్రాక్‌తోనే ‘సౌండ్‌పార్టీ’కి మంచి బజ్ వచ్చింది. మిగతా పాటలను త్వరలో విడుదల చేస్తాం’ అన్నారు.