మది విహంగమయ్యే...

ABN , First Publish Date - 2023-01-19T01:12:24+05:30 IST

అవికాగోర్‌, సాయిరోనక్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘పాప్‌కార్న్‌’. మురళీగంధం దర్శకుడు. అవికాగోర్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు...

మది విహంగమయ్యే...

అవికాగోర్‌, సాయిరోనక్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘పాప్‌కార్న్‌’. మురళీగంధం దర్శకుడు. అవికాగోర్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 10న విడుదలవుతోంది. ఈ చిత్రంలోని ‘మది విహంగమయ్యే’ పాటను నాగచైతన్య బుధవారం విడుదలచేశారు. సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. శ్రీజో సాహిత్యానికి శ్రవణ్‌ భరద్వాజ్‌ స్వరాలు సమకూర్చారు. బెన్నీదయాల్‌, రమ్యా బెహరా మధురంగా ఆలపించారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ఎం. ఎస్‌ చలపతి మాట్లాడుతూ ‘విభిన్నమైన కాన్సెప్ట్‌తో ‘పాప్‌కార్న్‌’ తెరకెక్కించాం. సినిమా అంతా లిఫ్ట్‌లోనే సాగుతుంది. చివరి 45 నిమిషాలు ఉత్కంఠభరితంగా ఉంటుంది. మురళీ గంధం టేకింగ్‌ అద్భుతంగా ఉంది’అన్నారు. ఈ సినిమాకు సహ నిర్మాతగా ఉన్నాను, ఇదొక డిఫరెంట్‌ మూవీ అని అవికాగోర్‌ చెప్పారు. ఆచార్య క్రియేషన్స్‌ అవికా స్ర్కీన్‌ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎం.ఎన్‌ బాల్‌రెడ్డి

Updated Date - 2023-01-19T01:12:24+05:30 IST