Bubblegum: ఇజ్జత్.. యూత్‌ని రాక్ చేస్తుందన్న మెగాస్టార్

ABN , First Publish Date - 2023-11-23T20:50:04+05:30 IST

రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా అరంగేట్రం చేస్తున్న చిత్రం ‘బబుల్‌గమ్‌’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన టీజర్, సాంగ్, పోస్టర్స్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. నేచురల్ స్టార్ నాని టీజర్‌ను విడుదల చేయగా, విక్టరీ వెంకటేష్ ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేశారు. గురువారం ఈ చిత్ర సెకండ్ సింగిల్ ‘ఇజ్జత్’ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Bubblegum: ఇజ్జత్.. యూత్‌ని రాక్ చేస్తుందన్న మెగాస్టార్
Bubblegum Movie Song Launch Event

రవికాంత్ పేరేపు (Ravikanth Perepu) దర్శకత్వంలో రోషన్ కనకాల (Roshan Kanakala) హీరోగా అరంగేట్రం చేస్తున్న చిత్రం ‘బబుల్‌గమ్‌’ (Bubblegum Movie). ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన టీజర్, సాంగ్, పోస్టర్స్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) టీజర్‌ను విడుదల చేయగా, విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేశారు. గురువారం ఈ చిత్ర సెకండ్ సింగిల్ ‘ఇజ్జత్’ (Izzat Song)ను మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. సుమ, రాజీవ్ కనకాల సుపుత్రుడు రోషన్ నటించిన తొలి సినిమా ‘బబుల్‌గమ్’ (Bubblegum). ఈ సినిమాలోని రెండవ సింగిల్ ఇజ్జత్ పాటని నా చేతులు మీదగా విడుదల చేయడం చాలా సంతోషంగా వుంది. తొలి పాట ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. రెండవ పాట యూత్‌ని రాక్ చేస్తుందన్న నమ్మకం వుంది. అంత హుషారుగా ఈ పాట వుంది. ఈ సినిమా ట్రైలర్ చూశాను. చాలా ఆకట్టుకుంది. యూత్ ఆకట్టుకునే కొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని ప్రజంట్ చేసిన దర్శకుడు రవికాంత్‌ని అభినందిస్తున్నాను. శ్రీచరణ్ పాకాల చాలా చక్కని మ్యూజిక్ ఇచ్చారు. ప్రత్యేకంగా ఆ ర్యాప్ సాంగ్‌లో నాకైతే రోషన్‌తో కలసి డ్యాన్స్ చేయాలనిపించింది. అంత హుషారుగా వుంది. ప్రతి క్లబ్, పబ్, యూత్ వేడుకల్లో ఈ పాట మారుమోగిపొతుందని చెప్పడంలో అనుమానం లేదు. కథానాయికగా మానస చాలా అద్భుతంగా నటించింది. తను మన తెలుగమ్మాయే కావడం అభినందనీయం. సుమ, రాజీవ్ ఎంతో ఆనందపడే, గర్వపడే క్షణాలు అతి త్వరలోనే రాబోతున్నాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్’’ అని అన్నారు. (Chiranjeevi Launches Bubblegum Movie Izzat Song)


chiru.jpg

పాట విషయానికి వస్తే.. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, మిమ్మల్ని మీరు సెలబ్రేట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మీ ప్రేమ సంపూర్ణంగా అనిపిస్తుంది. ఎందుకంటే.. ‘ఇజ్జత్...ఇచ్చి పుచ్చుకుంటే మంచిది’ అని ఈ పాట ద్వారా యంగ్ టీం ప్రపంచానికి చాటి చెబుతుంది. ఇజ్జత్ సాంగ్ అందరికీ, ముఖ్యంగా యువతకు మంచి సందేశంతో కూడిన పాటగా స్వరపరిచారు శ్రీచరణ్ పాకాల. ఎంఎస్ హరి అందించిన లిరిక్స్ క్యాచీగా వున్నాయి. ఎంఎస్ హరి, రోషన్ కనకాల ఈ పాటని ఎనర్జిటిక్‌గా ఆలపించారు. రోషన్ కనకాల తన డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్నాడు. మనసుని హత్తుకునే జెన్జీ ప్రేమకథతో ప్రేక్షకులను కట్టిపడేసేలా ఈ సినిమా రూపొందుతున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Chandra Mohan: నాన్న ఎప్పుడూ ఏం చెప్పేవారంటే.. - చంద్రమోహన్ కుమార్తె

*******************************

*Director Teja Marni: కథలు రాయలేక కాదు.. కథలు లేక కాదు.. రీమేక్స్ చేసేది అందుకే!

****************************

*Panja Vaishnav Tej: కొడితే పదిమంది ఎగిరిపోయే తరహా ఫైట్లు ‘ఆదికేశవ’లో ఉండవ్..

****************************

Updated Date - 2023-11-23T20:50:05+05:30 IST