Mega congratulations : బ్రహ్మానందంకు మెగా అభినందనలు

ABN , First Publish Date - 2023-02-01T23:30:17+05:30 IST

ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం పుట్టిన రోజు సందర్భంగా బుధవారం ఉదయం మెగాస్టార్‌ చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు...

Mega congratulations : బ్రహ్మానందంకు మెగా అభినందనలు

ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం పుట్టిన రోజు సందర్భంగా బుధవారం ఉదయం మెగాస్టార్‌ చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ‘నాకు తెలిసిన బ్రహ్మానందం అత్తిలిలో ఒక లెక్చరర్‌. ఈ రోజున బ్రహ్మానందం ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించి, గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కిన ఒక గొప్ప హాస్య నటుడు. పద్మశ్రీ అవార్డ్‌ గ్రహీత. కామెడీకి నిలువెత్తు నిదర్శనం. అతను కామెడీ చెయ్యనక్కర్లేదు. అతని మొహం చూస్తేనే హాస్యం వెల్లివిరుస్తుంది. పొట్ట చక్కలవుతుంది. ఆయన జీవితాంతం ఇలా నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి’ అని కూడా ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు మెగాస్టార్‌.

Updated Date - 2023-02-01T23:30:32+05:30 IST