ఇటలీలో కలవండి
ABN , First Publish Date - 2023-04-18T03:23:58+05:30 IST
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందిని రెడ్డి దర్శకత్వంలో స్వప్న సినిమా నిర్మించిన ‘అన్నీ మంచి శకునములే’ చిత్రం ప్రచార కార్యక్రమాలు ఊపందుకొన్నాయి. ‘ఏప్రిల్ 20న ఇటలీలో...

సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందిని రెడ్డి దర్శకత్వంలో స్వప్న సినిమా నిర్మించిన ‘అన్నీ మంచి శకునములే’ చిత్రం ప్రచార కార్యక్రమాలు ఊపందుకొన్నాయి. ‘ఏప్రిల్ 20న ఇటలీలో రిషి, ఆర్యలను కలవండి’ పేరుతో ఓ ప్లజంట్ వీడియో ద్వారా మేకర్స్ ప్రకటించారు. విభిన్న మనస్తత్వాలు కలిగిన రిషి, ఆర్యల మధ్య అందమైన అనుబంధాన్ని ఇందులో ప్రజెంట్ చేశారు. వారి ప్రయాణం ఆసక్తికరంగా ఉంటూ చివరలో వినోదభరితంగా ఉంది. ‘సినిమాలో ఆర్య, రిషి పాత్రలను దర్శకురాలు నందినీ రెడ్డి అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఈ పాత్రలకు సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జీవం పోశారు. మిక్కీ జే మేయర్ సంగీతం మా సినిమాకు అదనపు ఆకర్షణ. ఇంతవరకూ విడుదల చేసిన రెండు పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి’ అని చెప్పారు నిర్మాత ప్రియాంక దత్. రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, నరేశ్, గౌతమి, షావుకారు జానకి, వాసుకి ఇతర ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రం మే 18న విడుదల కానుంది.