చిరు ఇంటి నుంచే భోజనం వచ్చేది

ABN , First Publish Date - 2023-08-06T02:59:51+05:30 IST

‘‘చిరంజీవి సార్‌ క్రమశిక్షణ, అంకితభావం గురించి మా అమ్మ నాకు చాలా విషయాలు చెప్పేది. ఇప్పటికీ ఆయన సెట్లో అలానే ఉన్నారు. నాక్కూడా విలువైన సలహాలు...

చిరు ఇంటి నుంచే భోజనం వచ్చేది

‘‘చిరంజీవి సార్‌ క్రమశిక్షణ, అంకితభావం గురించి మా అమ్మ నాకు చాలా విషయాలు చెప్పేది. ఇప్పటికీ ఆయన సెట్లో అలానే ఉన్నారు. నాక్కూడా విలువైన సలహాలు ఇచ్చార’’న్నారు కీర్తి సురేశ్‌. చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘భోళా శంకర్‌’లో కీర్తి చిరుకి సోదరిగా నటించారు. ఈనెల 11న ‘భోళా శంకర్‌’ విడుదల అవుతోంది. ఈ సందర్భంగా కీర్తి ఏమన్నారంటే...

  • ‘‘రజనీసార్‌తో ‘పెద్దన్న’లో చెల్లాయిగా నటించాను. ఆ సినిమా షూటింగ్‌ సమయంలోనే ‘భోళా శంకర్‌’ ఆఫర్‌ వచ్చింది. ఇద్దరు సూపర్‌ స్టార్లతో చెల్లాయిగా నటించే అవకాశం రావడం కంటే గొప్ప అదృష్టం ఏముంటుంది? ‘భోళా శంకర్‌’ నా కెరీర్‌లో మర్చిపోలేని సినిమా’’

  • ‘‘చెల్లాయి పాత్ర అనగానే చిరు సార్‌తో డాన్స్‌ చేసే అవకాశం రాదేమో అని భయపడ్డా. కానీ సంగీత్‌ పాటలో మేమంతా కలిసి డాన్స్‌ చేశాం. మా కోసం కావాలని ఇరికించిన పాట కాదిది. చాలా బాగా వచ్చింది’’

  • ‘‘చిరు సార్‌ నన్ను బాగా చూసుకొనేవారు. ఆయన ఇంటి నుంచే నాకు రోజూ భోజనం వచ్చేది. మొదట్లో ‘నీకేం కావాలో చెప్పు ఇంటి నుంచి తీసుకొస్తా’ అనేవారు. ఆ తరవాత నాకేం కావాలో అడిగి మరీ రప్పించుకొనేదాన్ని. ‘నా కోసం కూడా ఇన్ని వంటలు రావు..’ అని చిరు సార్‌ నన్ను ఆట పట్టించే వారు. ఆయన ఇంటి నుంచి వచ్చే కూరల్లో ఉలవచారు, గుడ్డు నాకు చాలా ఇష్టం’’

  • ‘‘మెహర్‌ రమేశ్‌ స్పష్టత ఉన్న దర్శకుడు. తనకేం కావాలో బాగా తెలుసు. సెట్లో నన్ను ఓ చెల్లెలుగా చూసుకొనేవారు. నాకు ఈ సినిమాతో మెహర్‌ రూపంలో ఓ అన్న దొరికాడు. తమన్నా కామెడీ టైమింగ్‌ చాలా బాగుంటుంది. తను సెట్లో చాలా సరదాగా ఉండే మనిషి’’

Updated Date - 2023-08-06T02:59:51+05:30 IST