Mayuki: మేనకోడలి కోసం మేనమామ చేసే సాహసాలతో ‘మయుఖి’.. ట్రైలర్ విడుదల

ABN , First Publish Date - 2023-11-21T01:26:40+05:30 IST

టి.ఐ.ఎం. గ్లోబల్ ఫిల్మ్స్ సమర్పణలో నంద కిషోర్, డి. టెరెన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘మయుఖి’ చిత్ర ట్రైలర్‌ను నవంబర్ 20న అమెరికాలో విడుదల చేశారు. మేనకోడలి కోసం మేనమామ చేసే సాహసాలు, గ్యాంగ్ వార్స్ నేపథ్యంలో ఆద్యంతం థ్రిల్లింగ్‌‌గా సాగే ఈ చిత్ర షూటింగ్ మొత్తం అమెరికాలోనే జరుపుకుంది.

Mayuki: మేనకోడలి కోసం మేనమామ చేసే సాహసాలతో ‘మయుఖి’.. ట్రైలర్ విడుదల
Mayuki Still

టి.ఐ.ఎం. గ్లోబల్ ఫిల్మ్స్ సమర్పణలో నంద కిషోర్, డి. టెరెన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘మయుఖి’ చిత్ర ట్రైలర్‌ను నవంబర్ 20న అమెరికాలో విడుదల చేశారు. మేనకోడలి కోసం మేనమామ చేసే సాహసాలు, గ్యాంగ్ వార్స్ నేపథ్యంలో ఆద్యంతం థ్రిల్లింగ్‌‌గా సాగే ఈ చిత్ర షూటింగ్ మొత్తం అమెరికాలోనే జరుపుకుంది. అమెరికాలో స్థిరపడ్డ వందమందికి పైగా భారతీయులు, అమెరికన్ల నుండి ఎంపిక చేసిన సరికొత్త నటీనటులకు స్వయంగా శిక్షణనిచ్చి నితిన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ యాక్షన్, అడ్వెంచర్ మూవీ అమెరికాలో నిర్మించినా తెలుగువారి అభిరుచికి అనుగుణంగా ఉంటుందని ఆయన తెలిపారు.

ఎంతో శ్రమపడి డల్లాస్ పరిసరాల్లోని అద్భుతమైన లొకేషన్స్‌లో మయూఖి చిత్రీకరించాం. ఆ లొకేషన్స్ ఖచ్చితంగా ప్రేక్షకులకు కనువిందు చేస్తాయి. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి త్వరలో విడుదలకు సిద్ధం చేస్తున్నామని నితిన్ కుమార్ తెలిపారు. స్మాల్ స్ర్కీన్‌పై 15 ఏళ్ళపాటు ప్రసారమైన పర్యాటక కార్యక్రమం విహారి ది ట్రావెలర్‌కి దర్శక నిర్మాత అయిన ఏ.ఎల్. నితిన్ కుమార్ గతంలో నిర్మించిన ‘లోటస్ పాండ్’ అనే బాలల చిత్రం.. హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ బాలల చిత్రోత్సవానికి ఎంపికైంది.


నితిన్ కుమార్ దర్శకత్వం వహించిన ‘ఎ టీచింగ్ చెఫ్’.. లాస్ ఏంజెల్స్‌లో జరిగిన డ్రీమ్ మెషైన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం‌లోనూ, ఫ్లోరిడాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవం‌లోనూ ఉత్తమ షార్ట్ డాక్యుమెంటరీ అవార్డు గెలుచుకుంది. అలానే అనేక అతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపికై ఫైనల్స్‌కు చేరి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడాయన రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా సరికొత్త పంథాలో తీసిన ‘మయుఖి’ చిత్రం కూడా అందరినీ అలరిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. రెన్ని వెంగల, శిరీష, బేబీ మైత్రి, బేబి మయూఖి ప్రధాన పాత్రలు పోషించారు.

Updated Date - 2023-11-21T01:26:41+05:30 IST