మాస్‌ అడ్డా

ABN , First Publish Date - 2023-09-06T03:16:49+05:30 IST

కంచర్ల ఉపేంద్ర హీరోగా, సావిత్రి కృష్ణ హీరోయిన్‌గా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఉపేంద్రగాడి అడ్డా’. ఆర్యన్‌ సుభాన్‌ ఎస్‌.కె. దర్శకత్వంలో కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో...

మాస్‌ అడ్డా

కంచర్ల ఉపేంద్ర హీరోగా, సావిత్రి కృష్ణ హీరోయిన్‌గా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఉపేంద్రగాడి అడ్డా’. ఆర్యన్‌ సుభాన్‌ ఎస్‌.కె. దర్శకత్వంలో కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. హీరోహీరోయిన్ల మీద కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు నిర్మాత చెప్పారు. ‘షూటింగ్‌ పూర్తయ్యేవరకూ సింగిల్‌ షెడ్యూల్‌లో వర్క్‌ చేస్తాం. సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయి. సంగీత దర్శకుడు రాము అద్దంకి సారథ్యంలో వాటిని రికార్డ్‌ చేస్తున్నాం’ అని చెప్పారు. ‘చక్కటి కమర్షియల్‌ అంశాలు కలిగిన మాస్‌ సినిమా ఇది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు అనుగుణంగా యూత్‌ఫుల్‌ మెసేజ్‌ ఓరియంటేడ్‌ చిత్రం ఇది. మా హీరో ఉపేంద్ర పక్కా మాస్‌ పాత్ర పోషిస్తున్నారు. హీరోయిన్‌ బాగా డబ్బున్న అమ్మాయి పాత్ర. వీరిద్దరి మధ్య సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి’ అని చెప్పారు దర్శకుడు సుభాన్‌ ఎస్‌.కె.. తన కెరీర్‌ను మలుపు తిప్పే చిత్రమవుతుందని హీరో ఉపేంద్ర చెప్పారు.

Updated Date - 2023-09-06T03:16:49+05:30 IST