మరో నాయకుడు కోసం!
ABN , First Publish Date - 2023-10-28T04:59:45+05:30 IST
మణిరత్నం చిత్రాల్లో మరో మాణిక్యం.. ‘నాయకుడు’. అదో.. ఇండియన్ ‘గాడ్ ఫాదర్’. కమల్‌హాసన్ ప్రతిభాపాటవాలకు నిలువుటద్దంలా నిలిచిన చిత్రమది...
మణిరత్నం చిత్రాల్లో మరో మాణిక్యం.. ‘నాయకుడు’. అదో.. ఇండియన్ ‘గాడ్ ఫాదర్’. కమల్‌హాసన్ ప్రతిభాపాటవాలకు నిలువుటద్దంలా నిలిచిన చిత్రమది. 36 ఏళ్ల తరవాత కమల్, మణిరత్నం మళ్లీ కలిశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. కమల్ నటిస్తున్న 234వ చిత్రమిది. చెన్నైలో లాంఛనంగా ప్రారంభమైంది. కమల్‌హాసన్, మణిరత్నం, ఆర్.మహేంద్రన్, శివ అనంత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. కథానాయికగా నయనతార పేరు పరిశీలనలో ఉంది. అయితే చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సివుంది. ఛాయాగ్రహణం: రవి.కె.చంద్రన్, కూర్పు: శ్రీకర్ ప్రసాద్.