మన్యంరాజు వస్తున్నాడు
ABN , First Publish Date - 2023-04-27T00:07:14+05:30 IST
జీవన్ హీరోగా సోమసుందరం బి.ఎం దర్శకత్వం వహించిన చిత్రం ‘మన్యంరాజు’. వై. ప్రవీణ్, విజయ్‌బాబు, పుష్పలత బి. నిర్మించారు.

జీవన్ హీరోగా సోమసుందరం బి.ఎం దర్శకత్వం వహించిన చిత్రం ‘మన్యంరాజు’. వై. ప్రవీణ్, విజయ్‌బాబు, పుష్పలత బి. నిర్మించారు. విడుదలకు సిద్ధమవుతోంది. బుధవారం నిర్మాత సురేశ్‌బాబు ‘మన్యంరాజు’ టీజర్‌ని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ‘టీజర్‌తోనే సినిమా చూడాలనే ఆసక్తి కలిగింది. సినిమా పెద్ద హిట్టవ్వాలి’ అని కోరుకున్నారు. జీవన్ మాట్లాడుతూ ‘మన్యంరాజు’ సినిమా అద్భుతంగా ఉంటుంది, ప్రేక్షకులను అలరిస్తుంది’ అని చెప్పారు. సినిమా కొత్త తరహాలో ఉంటుందని దర్శకుడు తెలిపారు. మేలో విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.