ఎన్నో రాత్రులొస్తాయి కానీ...

ABN , First Publish Date - 2023-01-27T04:56:30+05:30 IST

నందమూరి కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అమిగోస్‌’. రాజేంద్ర రెడ్డి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించింది...

ఎన్నో రాత్రులొస్తాయి కానీ...

నందమూరి కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అమిగోస్‌’. రాజేంద్ర రెడ్డి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించింది. ఫిబ్రవరి 10న విడుదల అవుతోంది. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ సూపర్‌ హిట్‌ గీతం ‘ఎన్నో రాత్రులొస్తాయి కానీ..’ రీమిక్స్‌ చేశారు. కల్యాన్‌ రామ్‌, అషికా రంగనాథ్‌లపై ఈ పాటని తెరకెక్కించారు. ఈనెల 29న ఈ గీతాన్ని విడుదల చేస్తారు. కల్యాణ్‌ రామ్‌ త్రిపాత్రాభినయం చేసిన సినిమా ఇది. యాక్షన్‌, ఎమోషన్‌, ఫ్రెండ్‌షిప్‌ మేళవింపుగా సాగబోతోంది. ఇటీవలే ట్రైలర్‌ విడుదల చేశారు. ‘‘ఒకేలా ఉండే ముగ్గురి కథ ఇది. ఆ ముగ్గురూ స్నేహితులా? శత్రువులా? అనేది తెరపై చూడాలి. ఇటీవల విడుదల చేసిన పాటలకూ, ప్రచార చిత్రాలకూ మంచి స్పందన వస్తోంది. ‘ఎన్నో రాత్రులు వస్తాయి కానీ..’ పాట నందమూరి అభిమానుల్ని అలరిస్తుంద’’ని నిర్మాతలు తెలిపారు.

Updated Date - 2023-01-27T04:56:33+05:30 IST