అందరికీ నచ్చే మను చరిత్ర

ABN , First Publish Date - 2023-06-14T04:02:17+05:30 IST

యువ కథానాయకుడు శివ కందుకూరి హీరోగా భరత్‌ పెదగాని ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎన్‌.శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్న ‘మను చరిత్ర’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. మేఘా ఆకాశ్‌ , ప్రియ వడ్లమాని , ప్రగతి శ్రీ వాత్సవ్‌ కథానాయికలు....

అందరికీ నచ్చే మను చరిత్ర

యువ కథానాయకుడు శివ కందుకూరి హీరోగా భరత్‌ పెదగాని ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎన్‌.శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్న ‘మను చరిత్ర’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. మేఘా ఆకాశ్‌ , ప్రియ వడ్లమాని , ప్రగతి శ్రీ వాత్సవ్‌ కథానాయికలు. ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను హీరో విశ్వక్‌ సేన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రాజ్‌ కందుకూరిగారికి శివ ఎంతో నేనూ అంతే. నా మొదటి సినిమా విడుదల కాకముందు నుంచీ ఆయన నన్ను ప్రోత్సహిస్తున్నారు. ఈ ట్రైలర్‌ చాలా ఇంటెన్స్‌గా, ప్రామిసింగ్‌గా ఉంది. లవ్‌, యాక్షన్‌ నా ఫేవరేట్‌ జోన్‌. కచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు. హీరో శివ మాట్లాడుతూ ‘నాకు కంప్లీట్‌ ఫిల్మ్‌ ‘మను చరిత్ర’. ఎవరినీ నిరాశ పరచదు. ఈ సినిమా కోసం దర్శకుడు భరత్‌ ఎంతో కష్ట పడ్డారు.’ అన్నారు. ‘ఈ నెల 23న ఈ సినిమా వస్తోంది. టీమ్‌ అంతా ఎంతో కష్టపడింది. మీ అందరికీ నచ్చే సినిమా ఇది’ అన్నారు రాజ్‌ కందుకూరి. ఈ సినిమాను ఆదరించాలని దర్శకుడు భరత్‌ కోరారు.

Updated Date - 2023-06-14T04:02:17+05:30 IST