మణిరత్నం సినిమాలు గుర్తొస్తాయి

ABN , First Publish Date - 2023-08-24T02:40:42+05:30 IST

‘‘మణిరత్నం సార్‌ సినిమాలు విజువల్‌గా చాలా గొప్పగా ఉంటాయి. ‘ఖుషి’ చూస్తే అదే ఫీల్‌ కలుగుతుంది. దృశ్య పరంగా మణిరత్నం సినిమాలు గుర్తొస్తాయి’’ అన్నారు మురళి...

మణిరత్నం సినిమాలు గుర్తొస్తాయి

‘‘మణిరత్నం సార్‌ సినిమాలు విజువల్‌గా చాలా గొప్పగా ఉంటాయి. ‘ఖుషి’ చూస్తే అదే ఫీల్‌ కలుగుతుంది. దృశ్య పరంగా మణిరత్నం సినిమాలు గుర్తొస్తాయి’’ అన్నారు మురళి. ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన చిత్రం ‘ఖుషి’. విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఈ చిత్రం సెప్టెంబరు 1న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ ‘‘మణిసార్‌ సినిమాల్లోని విజువల్‌ బ్యూటీ ‘ఖుషి’లోనూ ఉంటుంది. అయితే మేం ఎవ్వరినీ కాపీ కొట్టలేదు. ఆ ఫీల్‌ని రీ క్రియేట్‌ చేశాం. ఇదో చక్కటి ప్రేమకథ. దాన్ని మరింత కలర్‌ఫుల్‌గా చూపించాం. విజయ్‌దేవరకొండతో గతంలో రెండు సినిమాలకు పని చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ చిత్రాలు ఆగిపోయాయి. ఎట్టకేలకు ‘ఖుషి’తో ఆ కోరిక నెరవేరింది. ఈ సినిమాలో పని చేసే అవకాశం మైత్రీ మూవీస్‌ వల్లే వచ్చింది. సినిమాలపై ఇంత ప్రేమ, అభిరుచి ఉన్న నిర్మాతల్ని నేనెక్కడా చూడలేదు. ఏం కావాలన్నా క్షణాల్లో సమకూరుస్తారు. సమంత చాలా ప్రొఫెషనల్‌గా ఉంటారు. సెట్లో ఆమె సినిమాల గురించి తప్ప మరే విషయాల్నీ ఆలోచించరు. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే హిట్‌ అయ్యాయి. దర్శకుడు శివ నిర్వాణకి సంగీతంపై మంచి పట్టు ఉంది. ఆయన వల్లే మంచి పాటలు అమరాయి. నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ ‘ఖుషి’ మంచి పేరు తీసుకొస్తుంది. ప్రేమకథల్లో ఓ మైలురాయిగా నిలుస్తుందన్న నమ్మకం ఉంద’’న్నారు.

Updated Date - 2023-08-24T02:40:42+05:30 IST