మాళవిక.. మణిమేకల!
ABN , First Publish Date - 2023-10-16T01:56:16+05:30 IST
కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘డెవిల్’. సంయుక్త మీనన్ కథానాయిక. అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. ఆయనే నిర్మాత. నవంబరు 24న విడుదల చేస్తున్నారు..

కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘డెవిల్’. సంయుక్త మీనన్ కథానాయిక. అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. ఆయనే నిర్మాత. నవంబరు 24న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో మణిమేకల అనే పాత్రలో మాళవిక నాయర్ కనిపించనున్నారు. ఆదివారం చిత్రబృందం ఆమె లుక్‌ని విడుదల చేసింది. శక్తిమంతమైన రాజకీయ నాయకురాలిగా ఆమె పాత్రని తీర్చిదిద్దారు. ‘‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా కల్యాణ్‌రామ్ నటన ఆకట్టుకొంటుంది. ఆయన ఓ అంతు చిక్కని రహస్యాన్ని ఎలా చేధించాడన్నదే కథ’’ అని దర్శకుడు తెలిపారు. సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్.