మలైకొట్టాయ్ మొనగాడు
ABN , First Publish Date - 2023-04-15T00:28:01+05:30 IST
ఇమేజ్ చట్రానికి కట్టుబడకుండా విభిన్న పాత్రలు పోషిస్తూ అభిమానులను అలరించడంలో మోహన్‌లాల్ ఎప్పుడూ ముందుంటారు.

ఇమేజ్ చట్రానికి కట్టుబడకుండా విభిన్న పాత్రలు పోషిస్తూ అభిమానులను అలరించడంలో మోహన్‌లాల్ ఎప్పుడూ ముందుంటారు. ఆ కోవలోనే ఆయన నుంచి వస్తున్న తాజా చిత్రం ‘మలైకొట్టాయ్ వాలిబన్’ (మలైకొట్టాయ్ యువకుడు). లిజోజోస్ పెల్లిస్సెరి దర్శకుడు. భారీ హంగులతో తెరకెక్కుతోంది. మోహన్‌లాల్ ఓ విభిన్న పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆయన శుక్రవారం సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న పీరియాడిక్ చిత్రమిది. ఎడారిలో తాళ్లను పట్టుకొని లాగుతూ ముందుకు కదులుతున్న లుక్‌లో మోహన్‌లాల్ గంభీరంగా కనిపించారు. షిబూ బేబీ జాన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ పిళ్లై సంగీతం అందిస్తున్నారు.