Mahesh is perfect for that role : ఆ పాత్రకు మహేశ్ పర్‌ఫెక్ట్..
ABN , First Publish Date - 2023-06-13T04:14:03+05:30 IST
‘‘ఓటీటీ మాధ్యమం నా కెరీర్‌ని పూర్తిగా మార్చేసింది. ‘ఫ్యామిలీమెన్’ సిరీస్‌తో నన్ను చిన్న పిల్లలు కూడా గుర్తు పట్టేస్తున్నారు. నటుడిగా నాకు వెండి తెర, ఓటీటీ అనే తేడాలు లేవు. ఓటీటీలోనే మరిన్ని కొత్త కథలు చెప్పొచ్చు’’ అన్నారు ప్రముఖ నటుడు...
‘‘ఓటీటీ మాధ్యమం నా కెరీర్‌ని పూర్తిగా మార్చేసింది. ‘ఫ్యామిలీమెన్’ సిరీస్‌తో నన్ను చిన్న పిల్లలు కూడా గుర్తు పట్టేస్తున్నారు. నటుడిగా నాకు వెండి తెర, ఓటీటీ అనే తేడాలు లేవు. ఓటీటీలోనే మరిన్ని కొత్త కథలు చెప్పొచ్చు’’ అన్నారు ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పేయ్. ఆయన న్యాయవాదిగా నటించిన ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ ఓటీటీ వేదికగా విడుదలైంది. ఆ తరవాత థియేటర్లలోనూ తీసుకొచ్చారు. ఈ చిత్రానికి వస్తున్న స్పందన పట్ల మనోజ్ బాజ్‌పేయ్ సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘వాస్తవిక ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ సినిమా చూస్తే న్యాయ వ్యవస్థపై గౌరవం, నమ్మకం పెరుగుతాయి. ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే సోలంకి అనే న్యాయవాది ఆమె తరపున ఎలా పోరాటం చేశాడన్న విషయాన్ని వాస్తవానికి దగ్గరగా చూపించాం. సోలంకి పాత్ర నా కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అన్నారు. ‘సొలంకి పాత్ర తెలుగులో ఏ హీరో చేస్తే బాగుంటుంది’ అనే ప్రశ్నకు బదులుగా ‘మహేశ్ అయితే సోలంకి పాత్రకు పర్‌ఫెక్ట్’ అని సమాధానం ఇచ్చారు. ‘పుష్ప 2’లో తాను నటిస్తున్నట్టు వస్తున్న వార్తలు ఊహాగానాలే అంటూ కొట్టిపడేశారు