మహేంద్రగిరి వారాహి

ABN , First Publish Date - 2023-11-16T00:54:29+05:30 IST

సుమంత్‌, మీనాక్షి జంటగా రాజశ్యామల బేనర్‌పై తెరకెక్కుతున్న తాజా చిత్రానికి టైటిల్‌ ఖరారైంది. ‘మహేంద్రగిరి వారాహి’ అనై టెటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసింది...

మహేంద్రగిరి వారాహి

సుమంత్‌, మీనాక్షి జంటగా రాజశ్యామల బేనర్‌పై తెరకెక్కుతున్న తాజా చిత్రానికి టైటిల్‌ ఖరారైంది. ‘మహేంద్రగిరి వారాహి’ అనై టెటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసింది. మంగళవారం చిత్రబృందం విశాఖ శారదాపీఠాన్ని సందర్శించింది. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో పూజలు చేసింది. పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఆశీస్సులు పొందారు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోందని దర్శకుడు జాగర్లపూడి సంతోష్‌ తెలిపారు. త్వరలో నిర్మాణం పూర్తవుతుందని నిర్మాతలు కాలిపు మధు, ఎం సుబ్బారెడ్డి తె లిపారు.

Updated Date - 2023-11-16T00:54:31+05:30 IST